Meeting with officials tomorrow.. Key decision
Trinethram News : అమరావతి :
సాధారణ పరిపాలన శాఖ సర్క్యులర్ జారీ..!
రేపు అధికారులతో సమావేశం.. కీలక నిర్ణయం..!?
నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
గతంలో మాదిరిగా కాకుండా మండల స్థాయి నుంచి నామినేటెడ్ పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.
మూడు పార్టీలు కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో ప్రతి నామినేటెడ్ పోస్టు భర్తీలో జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఏ పార్టీకీ ఇబ్బంది లేకుండా సమన్వయం చేసేందుకు వీలుగా మొత్తం నామినేటెడ్ పోస్టుల వివరాలను సేకరిస్తోంది.
ఇప్పటికే కొంత సమాచారాన్ని ఉన్నతాధికారులు తెప్పించుకున్నారు.
ఈ నేపథ్యంలో మండలస్థాయిలో పోస్టుల వివరాలు కూడా పంపించాలని అన్ని శాఖల ఉన్నతాధికారు లకు సీఎంవో నుంచి సర్క్యులర్ పంపించారు.
గత పదేళ్లలో ఏయే నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యాయి?
ఎవరు ఆయా పోస్టుల్లో ఉన్నారు? ఎంత కాలం ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న సమాచారం పంపించాలని సూచించారు.
ఈ మేరకు జీఏడీ సేవల సెక్రటరీ పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
సోమవారం జరిగే సమావేశానికి ఆయా పోస్టుల వివరాలను అందించాలని ఆదేశించారు.
ప్రతి విభాగం నుంచి ఒక అధికారిని ఈ సమావేశానికి పంపించి వివరాలను అందించాలని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App