TRINETHRAM NEWS

పత్రీజీ మహిళా చైతన్య కమిటీ వారు నిర్వహించిన ధ్యాన-జ్ఞాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల

Trinethram News : ప్రతి మనిషికి ఒత్తిడి తగ్గించేందుకు ధ్యానం ఎంతో అవసరమని అనారోగ్యాన్ని దరి చేరకుండా ఉంచుతుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు గౌతమి గాట్ వాకర్స్ అండ్ యోగ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణం నందు పత్రీజీ మహిళా చైతన్య కమిటీ వారు నిర్వహించిన ధ్యాన జ్ఞాన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల హాజరయ్యారు.

ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పిరమిడ్ ధ్యాన కేంద్ర స్థాపకులు స్వామి పత్రీజీ జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమని, ప్రజలందరూ ఆయన చెప్పిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, ప్రకృతిలో అన్ని జీవులు సమానమని పత్రీజీ తెలిపిన శాఖాహార విధానం వలన పశుపక్షాదులు మనతోపాటు జీవితాంతం మనుగడ సాగిస్తాయని, మనిషి శాఖాహారం భుజించడం వలన అనారోగ్యం దరిచేరకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. మహిళలు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, సుమారు 6 నెలల నుండి అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్ సునీత విలియంను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Gorantla