TRINETHRAM NEWS

కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పాడేరు శాసనసభ్యులు – మత్స్యరాస విశ్వేశ్వర రాజు.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్: -కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.

జీవో నెంబర్ 3 అమలు చేశాకే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయండి

*మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పాడేరు శాసన సభ్యులు, అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు.

ఈరోజు పాడేరు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న,
*-ఎమ్మెల్సీ కుంభ రవిబాబు,
అల్లూరి జిల్లా అధ్యక్షులు పాడేరు శాసన సభ్యులు
మత్స్యరాస విశ్వేశ్వర రాజు,
అరకు పార్లిమెంట్ సభ్యురాలు
తనూజ రాణి.

ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి ముందు ఏజెన్సీ అరకు ప్రాంతం వచ్చి బహిరంగ వేదికగా గిరిజన ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు.

జీవో నెంబర్ 3 అమలు చేస్తానని చెప్పి, హామీ ఇచ్చారు. ప్రభుత్వం రేపు విడుదల చేస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఐదవ వ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకు సర్వ అధికారాలు కలిగి ఉంటాయి. అలాంటి ప్రాంతంలోనే చట్టాలు కొల్పోతుంటే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు గిరిజన ప్రాంత ప్రజలకు మేలు జరగాలంటే ఖ చ్చితంగా జీవో నెంబర్ 3 ని అమలు చేయాలి. లేనిపక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా మరొక్క జీవోని ఏర్పాటు చేశాకే, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు.

లేని పక్షాన గిరిజన ప్రాంత ప్రజలంతా కూడా ప్రభుత్వం పైన ఉద్యమాలు తిరుగుబాటు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే గిరిజన ద్రోహిగా చిరస్థాయి వరకు మిగిలిపోతారు అని అన్నారు.

_ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, మాజీ ఎంపీపీ వంతలా బాబూరావు, ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కిల్లు కోటి బాబు, కూడా సురేష్ కుమార్, మాజీ జెడ్పీటీసీ కొర్ర కాసులమ్మా, మాజీ సర్పంచులు శరభ సూర్యనారాయణ, మినుముల కన్న పాత్రుడు, కూడా సుబ్రహ్మణ్యం, జామిగూడ సర్పంచ్ భుటారి వెంకట రావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App