WhatsApp Image 2024 03 22 at 11.47.43
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఎల్లుండి తెలంగాణ బంద్ కానుంది. ఈనెల 24వ తేదీన అంటే ఎల్లుండి… తెలంగాణ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు.
గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ బందును నిర్వహిస్తున్నారు మావోయిస్టులు.
Ellundi Telangana Bandh
ఈ బూటకపు ఎన్కౌంటర్ ను హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ వెల్లడించారు. నలుగురిని పోలీసులు ప్రాణాలతో తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత చంపేశారని ఆయన ఫైర్ అయ్యారు. ఈ ఎన్కౌంటర్ కు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్తో తెలంగాణ బంద్ చేపడుతున్నామని ఆయన వెల్లడించారు.
