Man throws Lighter into Bike’s : సిగరెట్‌ కాల్చవద్దన్నందుకు.. బైక్‌ పెట్రోల్‌ ట్యాంకులోకి లైటర్‌ విసిరిన వ్యక్తి

TRINETHRAM NEWS

Trinethram News : రాయ్‌పూర్: పెట్రోల్‌ బంకు వద్ద సిగరెట్‌ కాల్చేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే సిగరెట్‌ కాల్చవద్దని పెట్రోల్‌ బంకు సిబ్బంది కోరాడు. ఆగ్రహించిన ఆ వ్యక్తి పెట్రోల్‌ నింపుతున్న బైక్‌ ట్యాంకులోకి లైటర్‌ విసిరాడు. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 18న రాత్రి 7:40 గంటల సమయంలో ఉర్లా ప్రాంతంలోని పెట్రోల్ బంకు వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు.

కాగా, ఆ బైక్‌లో పెట్రోల్‌ నింపుతుండగా వెనుక కూర్చొన్న వ్యక్తి కిందకు దిగి సిగరెట్‌ వెలిగించేందుకు ప్రయత్నించాడు. గమనించిన పెట్రోల్ బంకు ఉద్యోగి సిగరెట్‌ కాల్చవద్దని అతడికి చెప్పాడు. ఆగ్రహించిన ఆ వ్యక్తి పెట్రోల్‌ నింపుతున్న బైక్‌ ట్యాంకులోకి లైటర్‌ విసిరాడు. దీంతో బైక్‌తో పాటు అక్కడ మంటలు ఎగసిపడ్డాయి. పెట్రోల్‌ బంకు ఉద్యోగి, బైక్‌పై ఉన్న వ్యక్తి భయంతో అక్కడి నుంచి పరుగెత్తారు.

మరోవైపు పెట్రోల్‌ బంకు ఉద్యోగి ఆ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఇంధనం సరఫరా నిలిపివేశాడు. అగ్నిమాపక పరికరంతో మంటలను ఆర్పివేశాడు. ఇంతలో పారిపోతున్న ఆ ఇద్దరు వ్యక్తులను బంకు సిబ్బంది పట్టుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకున్న తర్వాత ఆ ఇద్దరిని అప్పగించారు.

ఆ ఇద్దరు వ్యక్తులను ధర్మేంద్ర సింగ్, ఇమ్రాన్ ఖురైషిగా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్‌ చేశారు. వారి బైక్‌తో పాటు లైటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు. కాగా, ఆ పెట్రోల్‌ బంకు వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Man throws lighter into bike's petrol tank

You cannot copy content of this page

Scroll to Top