
ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 11: ఈనెల 12వ తేదీన విశాఖపట్నం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విద్యుత్ కాంట్రా క్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కై రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు తెలిపారు ఈ మేరకు గురువారం అరకు వెళ్లి మండలంలో కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృతంగా కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. విద్యుత్ సంస్కరణ పేరుతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకరించాలని కుట్రను కార్మికులందరూ ఐక్యంగా తిప్పి కొట్టాలని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విద్యుత్తును మన రాష్ట్రంలో ఆదోని, అంబనీలకు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని కుట్ర చేస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు పిఆర్సి ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకే రకం పనిచేసే కార్మికులకు నాలుగు రకాలు వేతనాలు తగ్గించి ఇస్తున్నారని అన్నారు. తక్షణం ఖాళీ పోస్టుల్లో ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను పోస్టులు భర్తీ చేసి రెగ్యులర్ చేయాలని తెలిపారు ప్రతి సబ్ స్టేషన్ లో వాచ్మెన్ పోస్ట్లు ఉండాలని అన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఒకే రకమైన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు 12న జరిగే రాష్ట్ర సదస్సులో ప్రైవేటీకరణ కార్మికుల సమస్యలు పరిష్కారం కై పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఆలోచనతో ఈ సదస్సులో ప్రణాళికలు రూపొందిస్తారని ఈ సదస్సును జయప్రదం చేయాలని వేపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు రామారావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
