నర్సింగ్ కళాశాల మైత్రి క్లినిక్ ప్రారంభోత్సవం చేశారు
వికారాబాద్ జిల్లా ప్రతినిధిత్రినేత్రం న్యూస్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో బంగంగా ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం లో ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి వర్చువల్ విధానంలో నర్సింగ్ కళాశాల, మైత్రి క్లినిక్ ప్రారంభోత్సవం చేసారు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం వికారాబాద్ జిల్లా అనంతగిరి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్య ఉత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమహారతి,డీఎంహెచ్ఓ వెంకట రవణ, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ పద్దతిలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను, మైత్రి ట్రాన్స్ క్లినిక్ ను మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ప్రారంభించగా, స్థానికంగా అనంతగిరి మెడికల్ కళాశాల నందు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా కోడంగల్ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App