
తేదీ : 11/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ యంపి కేశినేని. శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడుతూ వివరించడం జరిగింది. మూఢనమ్మకాలు, అంత విశ్వాసాలతో నలిగిపోతూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మ జ్యోతిరావు పూలే కొత్తదారి చూపించడంతో పాటు చేయి పట్టి నడిపించారన్నారు. విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అని, సాటి చెప్పారు. వారి సేవలను కొనియాడారు.
భారతదేశంలో సామాజిక సంస్కరణ ఉద్యమానికి బీజం వేసిన మొదటి మహోన్నతుడు ఆయన అని పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ , పూలే ఆదర్శాలకు అనుగుణంగా అన్ని వర్గాలకు రాజకీయ అధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. పూలే ఆశయ సాధనాల కోసం టిడిపి నిరంతరం కృషి చేస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి భాను .ప్రకాష్ యాదవ్, రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ సింగం. వెంకన్న, మైలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉయ్యూరు.
నరసింహారావు, టి ఎన్ టి యు సి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పాల మాధవ. రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరిషపొగు .రాజేష్, రాష్ట్ర కార్యదర్శి, చెన్నుపాటి. గాంధీ, కార్పొరేటర్ చెన్నుపాటి. ఉషారాణి, యన్ టి ఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కరీముల్లా, ఎస్సీ సెల్ అధ్యక్షులు సంగా. సంజయ్ వర్మ బీసీ గౌడ్ సాధికారిక కన్వీనర్ కిషోర్ బాబు, నాయకులు ఉప్పడి. రాము, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మహిళల విద్య కోసం పోరాడిన గొప్ప సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
