Mahadharna by National Health Mission employees in front of Hyderabad Commissioner’s office
ఎన్ హెచ్ ఎం రాష్ట్ర అధ్యక్షులు ఎం నరసింహ, జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా.
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న వివిధ రకాల సిబ్బందిని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ నరసింహ మాట్లాడుతూ కమిషనర్ కార్యాలయం ముందుట మహాధర్నా నిర్వహించడం జరిగింది. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈరోజు ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.
జాతీయ ఆరోగ్య మిషిన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రంలో 17514 ఎన్హెచ్ఎంలో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని , శ్రమ దోపిడికి గురవుతూ పేద ప్రజల ఆరోగ్యమే పరమావదిగా భావించి పని చేస్తుంటే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించకుండా కాలయాపన చేయటాన్ని విమర్శించారు. గత ఏడు నెలల పిఆర్సి బకాయిలు మరియు మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని,హెల్త్ కార్డ్స్, ఇన్సూరెన్స్, ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8నెలలు గడుస్తున్న ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల్లో దిగులకు పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు 4వ తరగతి సిబ్బందికి 26వేల రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు, 4000 మందికి 510 జీవోలో అన్యాయం జరిగింది వారికి న్యాయం చేయాలని జీవో సవరించి పెంచకుండా గత ప్రభుత్వం లాగానే దాట వేస్తుందని, వెంటనే కనీస వేతనాలు పెంచాలని ధర్నా ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నూకల అంజి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే హెచ్ఆర్డీఏ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మ, జ్యోతి, శ్రావణ్, అనిత, తిరుమలేష్, సంతోష్, కరుణ, దేవనబోయిన బాపు యాదవ్, రాజ్ కుమార్, మల్లేష్, మునీర్, అనిల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App