ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 09 23 at 16.09.57

TRINETHRAM NEWS

Maddela Dinesh was nominated for “National Award for Best Service to Society”

ప్రజా ఉద్యమాలు, సామాజిక సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 06న తిరుపతిలో దినేష్ కు అవార్డ్ ప్రధానం చేయునున్న జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు నిరంతరం ప్రజా సమస్యల పై పోరాడుతూ ప్రజల హక్కుల సాధన కొరస పోరాటం చేస్తూ మరియు నిరుపేదలు, నిరాశ్ర యులకు, అనాధలకు, అభాగ్యులకు అన్నర్తులకు అండగా ఉంటున్న ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ బెస్ట్ సర్వీస్ ఫర్ సొసైటీ జాతీయ అవార్డ్ 2024 కు ఎంపికయ్యారనీ వారు పేర్కొన్నారు.
మద్దెల దినేష్ వామపక్ష భావాలు కల్గిన వ్యక్తి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ ప్రజాసంఘాల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తు ప్రజా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తూ ఎన్నో సమస్యలను పరిష్కరించిన ఉద్యమకారుడని, ఒక వైపు ప్రజా ఉద్యమాలు చేస్తూ మరో వైపు సామాజిక సేవలు చేస్తూ ముందుకు సాగుతున్న మద్దెల దినేష్ సేవలను ఉద్యమాలను వాటి ఫలితాలను బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ ఆప్ ఇండియా గుర్తించిన జాతీయ అధ్యక్షులు నాల్ల రాధాకృష్ణ మరియు బాదె వెంకటేశం తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ గుర్తించి అవార్డుకు సహకరించిన మద్దెల దినేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో అక్టోబర్ 6, 2024 ఆదివారం రోజున అవార్డ్ సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ అయిన బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా బెస్ట్ సర్వీస్ ఫర్ సొసైటీ జాతీయ అవార్డ్ ఎంపికైన సందర్భంగా ప్రధానం చేస్తారని మద్దెల దినేష్ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Maddela Dinesh was nominated for “National Award for Best Service to Society”

1 thought on “National Award : మద్దెల దినేష్ కు “బెస్ట్ సర్వీస్ ఫర్ సొసైటీ జాతీయ అవార్డుకు” ఎంపిక

Comments are closed.

You cannot copy content of this page