హనుమకొండ : భీమారం బస్టాప్ వద్ద శనివారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన లారీ తొలుత ఆటోను ఢీకొట్టి, అనంతరం విధుల్లో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కన్నం రాణి(45) కాలు పూర్తిగా నుజ్జుకాగా, మంద విక్టోరియాకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆటో డ్రైవర్ జనార్దన్ చేయి విరిగింది. గమనించిన 108 సిబ్బంది సురేశ్, కోటిలింగం తక్షణమే స్పందించి బాధితులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


