![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-19.58.21.jpeg)
అక్రమ ఇసుక రవాణాపై మెరుపు దాడి
లారీని సీజ్ చేసి సీతానగరం పోలీస్ స్టేషన్ కి తరలించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.
రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజవర్గం సీతానగరం మండలం వంగలపూడి ఇసుక ర్యాంపు పై సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేసి సీతానగరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. కొంతకాలంగా వంగలపూడి ఇసుక ర్యాంప్ 1&2లో ఏ విధమైన బిల్లులు లేకుండా నిర్దేశించిన ధర కన్నా మూడు రెట్లు అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్నారని బాధితులు బహిరంగంగానే చెబుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అధిక ధరలకు ఇసుక విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కలెక్టర్ మాటను పక్కనపెట్టి అధిక ధరలకు భారి స్థాయిలో అక్రమ ఇసుక ను తరలిస్తున్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులోకి లేకుండా చేస్తున్నారు. స్థానిక ప్రజలు సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం ఇసుక ర్యాంపుల పై దాడి చేసి, ఒక లారీని సీజ్ చేసి, సీతానగరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్రసాద్ వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఈ విధమైన అక్రమ రవాణా ఇసుకపై తమకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Lightning strike on illegal](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-19.58.21-1024x576.jpeg)