
తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు: వాతావరణశాఖ..!!
Trinethram News : హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
బుధవారం పలు జిల్లాల్లో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే ఐదు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద, పశ్చిమ మధ్య అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని తెలిపింది. దీని అనుబంధ చక్రవాతపు ఆవర్తనం ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించిందన్నారు. ఇది పశ్చిమ నైరుతి దిశలో ప్రయాణించి రాగల 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
