జూలై 23, 2026

WhatsApp Image 2023 12 23 at 8.06.46 PM

TRINETHRAM NEWS

నియంతపాలనను రాబోయే ఎన్నికల్లో చరమ గీతం పాడుదాం

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం లో భాగంగా నేడు పిట్టలవానిపాలెం మండలం లోని భవనంవారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు ఇస్తు వారికీ చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు. అనంతరం భవిష్యత్ కు గ్యారంటీ పత్రాలలో వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి భవిష్యత్తు గ్యారెంటీ సంక్షేమ పథకాలు గురుంచి వివరించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ.

ముందుగా డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులార్పించారు. అనంతరం స్థానిక చర్చి నందు ప్రత్యేక ప్రార్ధన లు చేసి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు

ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ..

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక నియంత పాలన సాగిస్తున్నారన్నారు

రానున్న ఎన్నికలో ఈ నియంతపాలనకు చరమ గీతం పడాలన్నారు

ఎక్కడ చుసిన ఇసుక దోపిడీ, మట్టి మాఫియా నడుపుతున్నారు

ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నపుడు ఈ సైకో పాలన మీద తీవ్ర వ్యతిరేకం కనిపిస్తుందని, రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా సైకో ప్రభుత్వంకు తగిన గుణపాఠం చెపుతారన్నారు

తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రాగానే మినీ మేనిఫెస్టో లోని 6సంక్షేమ పధకాలు అమలు అవుతాయన్నారు

రాబోయే ఎన్నికలో బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్. ఎల్. ఏ అభ్యర్థి గా పోటీ చేస్తున్నానని ఆశీర్వదించాలని కోరారు

ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page