ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 11 21 at 17.02.26

TRINETHRAM NEWS

మతోన్మాద విద్వేష శక్తుల నుండి తెలంగాణ ను రక్షించుకుందాం

శ్రామికుల ఐక్యతను బలోపేతం చేద్దాం మత సామరస్యాన్ని కాపాడుకుందాం.!!

వామపక్ష పార్టీల పిలుపు.

రాష్ట్ర వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జిల్లా వామ పక్ష పార్టీల ఆధ్వర్యంలో మతోన్మాద వ్యతిరేక సదస్సును నిర్వహించడం జరిగింది.
ఈ సదస్సు లో సిపిఐ.జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం,సీపీఎం. జిల్లా కార్యదర్శి వై యాకయ్య,,సీపీఐ (ఎం ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు నంది రామయ్య,సీపీఐ (ఎం ఎల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కే రాజన్న, సిపిఐ (ఎం ఎల్) రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్ లు మాట్లాడుతూ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తుందని, భారత రాజ్యాంగాన్ని ఖూనిచేస్తూ,
ప్రజల మధ్య భావోద్వేగాలనీ
రెచ్చగొడుతుందని వారు అన్నారు.
మతం వ్యక్తిగతమని, కానీ మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని వారు అన్నారు.
కులం ,మతం, ప్రాంతం పేరుతో పాలక వర్గ పార్టీలు ప్రజల ఆలోచనలు వక్రమార్గం పట్టిస్తున్నాయని అన్నారు.
మహిళలు దళితులు ఆదివాసీల మీద దాడులు దౌర్జన్యాలు అత్యాచారాల పట్ల వీడికి ఎటువంటి పట్టింపు లేదని నేరస్తులు మైనారిటీ మతాలకు చెందినవారు అయినప్పుడు మాత్రమే అందిస్తూ మతం రంగు పులిని దర్శనలు సృష్టిస్తున్నారన్నారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలను చైతన్యం చేయడానికి మతసామరాస్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రజా సమస్యలు, పౌర హక్కులు, లౌకిక ప్రజాస్వామ్యం, సామరస్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం, నిరంకుశ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మతోన్మాదం,కులో న్మాదం, రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని చాటి చెప్పాలన్నారు.
ఈ ఆర్ఎస్ఎస్ బిజెపి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి పిలుపునిచ్చారు.
ఈ యొక్క సదస్సుకు జిల్లా వామ పక్ష పార్టీల నాయకులు కే కనకరాజు, ఎం మహేశ్వరి, జూపాక శ్రీనివాస్, ఈ నరేష్, ఈ రామకృష్ణ లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.
ఈ సభ లో గౌతమ్ గోవర్ధన్, వేల్పూల కుమారస్వామి, ఐ కృష్ణ, రమేష్, గుండేటి మల్లేశం, మోహన్, బి అశోక్, ఉపేందర్, చంద్రశేఖర్,మేరుగు చంద్రయ్య,గుమ్మడి వెంకన్న దితరులతో పాటు 200 మంది. పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page