TRINETHRAM NEWS

Let’s keep our areas clean!

మన ఆరోగ్యాలను కాపాడుకుందాం!

11వ వార్డు స్వచ్ఛ ధనం పచ్చ ధనం అవగాహన సదస్సు కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్

కొత్తగూడెం అర్బన్: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ప్రవేశపెట్టిన ,స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి ఆదేశాల మేరకు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ ధనం- పచ్చదనం కార్యక్రమాన్ని 11వ వార్డు కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సులో వారు మాట్లాడుతూ ఈరోజు 5 /8/2024న మొదటి రోజున స్వచ్ఛ ధనం -పచ్చదనం పై అవగాహన కల్పిస్తూ మన పరిసర ప్రాంతాలను మనం పరిశుభ్రం చేసుకుందాం! మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం !అని వార్డు ప్రజలకి విజ్ఞప్తి చేశారు ..

ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నుండి 9వ తారీఖు వరకు నిర్వహించబడుతుందని ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానంతో పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుందామని, ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తడి పొడి చెత్త పై అవగాహన కల్పిస్తూ మున్సిపాలిటీ వారిచ్చిన తడి, పొడి చెత్త బుట్టలలో తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు .

అలాగే మన ఇంట్లోని కూలర్లు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి బోండా ,హౌస్ లో నిలువ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రం చేసుకోవాలని తద్వారా దోమల లార్వా గుడ్లు పెరగకుండా నివారణ చేసుకుని మలేరియా, డెంగ్యూ ,టైఫాయిడ్ జ్వరాల నుండి రక్షణ పొందాలని ప్రజలకు వివరించారు .అనంతరం వార్డు ప్రజలచే ప్రధాన రహదారి వీధుల్లో ర్యాలీ నిర్వహించి శ్రమదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ స్పెషల్ ఆఫీసర్ చాంద్ పాషా, నాయకులు అమ్ములు, జోదియా, కిషన్, బిచ్చు, బస్తీ దవాఖాన డాక్టర్ జానకిరామ్, టీచర్ సుందరి, జి ఎన్ ఎమ్ వసంత దేవి, డ్వాక్రా ఆర్పీలు కావేరి, జానకి , అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, తులసి బాయ్, యూత్ నాయకులు మనోజ్, మహేష్, బిక్కులాల్, వెంకటేశ్వర్లు, రాంప్రసాద్, చందు, గోపాల్, భరత్, అటెండర్ భవాని, ఈశ్వరి, శానిటేషన్ సిబ్బంది వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's keep our areas clean!