
ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆర్జీ1 కన్వీనర్ గా ఆరేపల్లి హరీష్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్140/2018, రామగుండం 1 ఏరియా కన్వీనర్ గా సీనియర్ నాయకులు 2వ గనిలో విధులు నిర్వహిస్తున్న ఆరేపల్లి హరీష్ ను నియమించారు. ఈ మేరకు శనివారం ఏరియా జిఎం తో జరిగిన సమావేశంలో సంఘం జనరల్ సెక్రెటరీ ఆంథోటి నాగేశ్వర్ రావు కమిటీ ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ఎల్లప్పుడూ సభ్యులు కట్టుబడి పని చేయాలని సూచించారు హక్కుల సాధనలో సంఘం సమస్యలు పరిష్కారంలో జిఎం సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన అధ్యక్షులు ఎల్కతుర్తి రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఆంతోటి నాగేశ్వరరావు సెంట్రల్ కమిటీ సభ్యులు ఇరువురాల శ్రీనివాస్ ఏరియా లైసెన్స్ ఆఫీసర్ దొంత వెంకటేశ్వర్లు నాయకులు ఈర్ల రాజేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో గడ్డం శంకర్, రాకేష్, రాజేష్, సంతోష్, శివ, బాలకిషన్, శరత్, సుభాష్, కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
