ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Landslide Nagaland

Landslide Nagaland : త్రినేత్రం న్యూస్ : గువహాటి/కోహిమా, జులై 19: నాగాలాండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మోన్ (Mon) జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో పిల్లలు సహా ఎనిమిది మంది మరణించి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికితీశారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో ఆకస్మిక వరదలు కూడా పోటెత్తాయి.

ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మోన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ వెన్న్యేయ్ కొన్యాక్ ఈ ప్రమాదంపై వివరాలు అందిస్తూ… ‘ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నాము. ఇప్పటివరకు శిథిలాల నుంచి నలుగురి మృతదేహాలను మాత్రమే వెలికితీయగలిగాము. గల్లంతైన మిగిలిన వారి కోసం ఆ ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page