ఉత్తమ సేవలకు కృష్ణారావు కు ప్రశంశలు
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం.
ఒంగోలు: మార్కాపురం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి పివి కృష్ణారావుకు ఉత్తమ సామాజిక సేవకు గానూ ప్రశంసా పత్రం లభించింది. కృష్ణారావు సేవలను గుర్తించిన ప్రభుత్వం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాన్ని అందజేసింది. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ ల చేతుల మీదుగా కృష్ణారావు ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ మార్కాపురం ప్రాంతంలో తాను చేసిన సేవలను గుర్తించి, తనను ప్రశంసా పత్రంతో అభినందించిన జిల్లా అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత సమయం కేటాయించి ప్రజలకు సేవ చేసేందుకు ముందు ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.కాగా బీజేపీ నాయకులు కృష్ణారావు కు ఉత్తమ సేవా ప్రశంశా పత్రం రావడం పట్ల ఆయన మిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App