జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 17 at 18.54.49

TRINETHRAM NEWS

ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*ఉదయం 4557 , మధ్యాహ్నం 4440 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు

*పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, నవంబర్ -17:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలో గ్రూప్ 3 పరీక్షల ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

ఆదివారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపల్లి శాంతి నగర్ లొని ట్రినిటీ డిగ్రీ కళాశాల, రామగిరి లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాలలో జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష, పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులకు కల్పించిన వసతులు, బయోమెట్రిక్ విధానం, అభ్యర్థుల చెకింగ్ ప్రక్రియ, లైటింగ్ వంటి ప్రక్రియ సజావుగా జరుగుతుందో లేదో పరిశీలించి, జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.

పెద్దపెల్లి జిల్లాలో మొత్తం 8 వేల 947 మంది అభ్యర్థులకు 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆదివారం ఉదయం జరిగిన మొదటి పేపర్ పరీక్షకు 4557 మంది అభ్యర్థులు హాజరు కాగా, 4390 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 4440 మంది అభ్యర్థులు హాజరు కాగా, 4507 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page