జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 27 at 17.44.49

TRINETHRAM NEWS

Konda Laxman Bapuji was the first to resign for separate Telangana

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతిని ఘనంగా

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని జిల్లా అధికారులతో మరియు నాయకులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపుజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు స్వాతంత్ర్య సమరయోదుడు తెలంగాణ ఉద్యమకారుడు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పింస్తున్నమని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేసి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అతడిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నాడు తెలంగాణ కోసం మంత్రి పదవి కి రాజీనామా చేసి త్యాగం చేసిన మొట్టమొదటి నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మన ప్రభుత్వ హయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు జిల్లా పద్మశాలి సంఘం నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Konda Laxman Bapuji was the first to resign for separate Telangana

You cannot copy content of this page