IIT Student : ఐఐటీ విద్యార్థి వెంకటరాజును సత్కరించిన కాపు అభ్యుదయ సంఘము

TRINETHRAM NEWS

ఆలమూరు: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ముంబైలో ఐఐటీ కళాశాలలో సీటు సాధించిన మండలంలోని సంధిపూడి గ్రామానికి చెందిన విద్యార్ది తోట మోహన్ నాగ వీర వెంకటరాజును గురువారం మండపేటలోని కాపు అభ్యుదయ సంఘం ఘనంగా సత్కరించింది. సంఘం ప్రెసిడెంట్ జిన్నూరి సాయిబాబు,వర్రే సత్యనారాయణ,యాళ్ల శ్రీను, మెండు బాపిరాజు, ఈలి తాతజీ, దూలం నాగు మొదలైన వారి ఆధ్వర్యంలో విద్యార్థిని సాలువాలు,పూలమాలలతో ఘనంగా సత్కరించి, అభినందించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తోట రాజు జేఈఈ అడ్వాన్స్ లో ర్యాంక్ సాధించి ఐఐటీ సీటును బొంబాయిలో సాధించడం తమకు గర్వంగా ఉందని, ఇదే పట్టుదలతో ముందుకు వెళ్లి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ, గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తూ సమాజానికి ఉపయోగపడాలని కోరారు. అలాగే రాబోయే కాలంలో చదువుకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా కాపు సంగం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థి చదువుకి ఉపయోగించాలని కొంత నగధు బహుమతిని అందజేశారు.ఈ మేరకు తన కుమారున్ని అభినందించి చదువుకి అండగా ఉండటానికి స్వచ్చందంగా ముందుకు వచ్చిన మండపేట కాపు అభ్యుదయ సంఘానికి ఆ విద్యార్ది తండ్రి తోట వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kapu Abhyudaya Sangh felicitated

You cannot copy content of this page

Scroll to Top