జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 02 at 6.15.01 PM

TRINETHRAM NEWS

Trinethram News : వికారాబాద్ : 2nd Aug 2024

ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వికారాబాద్ శ్రీ రామ మందిరంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారిని శాకంబరి రూపంలో అలంకరించడం జరిగింది. అలాగే మన ఊరు మనసారే కార్యక్రమంలో భాగంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాలే లక్ష్మణ్ గుప్తా, ప్రధాన కార్యదర్శి యాష్కి సునీల్ కుమార్, ఉపాధ్యక్షులు ఈరెల్లి రఘునందన్, కోశాధికారి దోమ శ్రీకాంత్, సహాయ కార్యదర్శి మ్యాడం వేణుగోపాల్, జిల్లా మహిళా అధ్యక్షురాలు యాష్కి శిరీష, మహిళా సంఘం అధ్యక్షురాలు మ్యాడం లక్ష్మి, ప్రధాన కార్యదర్శి యాష్కి సువర్ణ, ఉపాధ్యక్షురాలు కొట్టి విజయలక్ష్మి, సహాయ కార్యదర్శి కుంచం శ్రీదేవి, కోశాధికారి పోకల మమత, ఆర్యవైశ్య సంఘం మరియు మహిళా సంఘం సభ్యులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page