జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 20 at 11.39.40

TRINETHRAM NEWS

ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు మరియు టాస్క్ ఫోర్స్ మార్కాపురం వారితో కలిసి బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్

30 క్వార్టర్ బాటిళ్లు మరియు 08 ఫుల్ బాటిళ్లు సీజ్.. ముగ్గురు అరెస్టు…

కంభం: ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెళ్ళ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్ట్ షాపుపై ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు వారు మరియు టాస్క్ ఫోర్స్ మార్కాపురం వారితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చెన్నకేశవుల వెంకటరంగమ్మ అనే మహిళను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుండి 15 క్వార్టర్ (180 ఎంఎల్) బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బేస్తవారిపేట మండలంలోని P.V. పురం గ్రామంలో మేడిబోయిన చిన్న పిచ్చయ్య అనే వ్యక్తి వద్ద నుండి 8 ఫుల్ (750ml)బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు మరియు అదే గ్రామంలో తాటిచెర్ల రంగమ్మ అనే మహిళ వద్ద నుండి 15 క్వార్టర్ (180ml) బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం తరలించినా, అక్రమంగా మద్యం కలిగి ఉన్నా, అమ్మినా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page