
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సీతాయిగూడెం గ్రామపంచాయతీ సూరంపాలెం గ్రామంలో జరిగిన శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ సపరివార దేవతా సహిత శ్రీశ్రీశ్రీ కోదండ రామ స్వామి వార్ల యంత్ర విగ్రహ శిల ధ్వజ శిఖర ప్రతిష్టా మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, టీజీఐడిసి చైర్మన్ మువ్వా విజయబాబు, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఊకంటి గోపాలరావు, బత్తుల అంజి, ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్, వారు మాట్లాడుతూ ఆ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నారు.
అనంతరం స్వామివారి ఆలయ నిర్మాణ కమిటీకి ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు 60 వేల రూ” ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దంపతుల చేతుల మీదుగా విరాళం అందజేశారు. అనంతరం అన్న ప్రసాదాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు అనుమాల సత్యనారాయణ, నరసింహారావు, ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, గాడి తిరుపతిరెడ్డి, ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిమే వంశీ, సురభి రాజేష్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మండల కార్యదర్శి మిర్యాల అవినాష్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పాలకుర్తి రవి, వెలకం వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ నాయకులు పొంగులేటి, జారే ,మువ్వా అభిమానులు భక్త బృందం పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
