
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 8 : వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు వంశీ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వంశీ రెడ్డి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, వారికి భూమాతకు ఉన్నంత సహనం, ఓర్పు ఉందని అనడంలో అతిశయోక్తి లేదని అన్నారు.
బి.జి.పి ప్రభుత్వం బేటి బచావో-బేటి పడావో నినాదంతో మహిళల విద్యకు, సంక్షేమానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చిందని, అంతేగాక వివిధ రంగాల్లో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వారికి ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తున్నారని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శ్రీహరి యాదవ్, రేపన్ రాజు, నర్సింగ్ రావు,తిమ్మయ్య, కనకయ్య, లక్ష్మణ్, వేణు, లలితారెడ్డి, మమత, రేణుక, జయ శ్రీ, బిజెపి కార్యకర్తలు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
