TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ…

నేడు మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష ధోరణి మన సమాజం కారణం అన్నారు. ప్రేమ, త్యాగం, సహనం కలయికే స్త్రీకి ప్రతిరూపం అన్నారు. మన సనాతన ధర్మంలో స్త్రీకి ఎంతో గౌరవం ఇచ్చింది , అందుకు అర్థనారీశ్వర తత్వం ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. మన భారతీయ సంస్కృతినీ భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మనమే వహించాల్సి ఉందన్నారు.

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఐఏఎస్, మాట్లాడుతూ,

మహిళ లకు సమానత్వం ” చర్య వేగవంతం చేయండి” అనే నినాదం తో , లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను వెల్లడి చేసే క్రమంలో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. పురాణాల నుంచీ నేటి ఆధునిక కాలం వరకు మహిళల యెుక్క ప్రాధాన్యత ఇవ్వడం పై, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు కార్యక్రమాల రూపకల్పన పై వక్తలు వివరించడం జరిగిందన్నారు. శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణ భద్రతా కోసం సర్వీసెస్ తీసుకొని రావడం జరుగుతోందని, వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం అన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. మెప్మా ఆధ్వర్యంలో కోటి ఉత్పత్తులను మార్కెటింగ్ చెయడం ద్వారా కోటి రూపాయల ఆదాయం సమ కూర్చడం ఒక విజయం సాధించినట్లు తెలిపారు.

విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం ద్వారా జెండర్ సమానత్వం కోసం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో పాఠ్యాంశం లో పొందు పరచడం జరుగుతున్నట్లు తెలిపారు. తద్వారా రానున్న రోజుల్లో మన భారతీయ సంస్కృతిలో భాగం ఉన్న జెండర్ సమానత్వం పై మహిళకు ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యం కానున్నట్లు తెలియ చేశారు. జిల్లాలో మహిళా రక్షక్ ఏర్పాటు చేసినా ఎస్పీ డి నరసింహా కిషోర్ అభినందనీయులు, రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు మన జిల్లా నాంది పలికిందన్నారు.

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. ప్రసన్న మాట్లాడుతూ…

మహిళల పట్ల వివక్ష కుటుంబం నుంచే పారద్రోలి నప్పుడే నిజమైన మహిళా సాధికటికత సాద్యం అవుతుందని నమ్ముతున్నా అని పేర్కొన్నారు. అన్నీ రంగాల్లో మహిళలు నేడు ప్రతిభ చూస్తున్నారన్నారు. పురుషులు తో సమానంగా మహిళలు అడుగులు వేసినప్పుడే నిజమైన సమానత్వం సౌభ్రాతృత్వం సాద్యం అవుతుందని తెలిపారు. మన ఇంటి లో అబ్బాయి అమ్మాయి ఉంటే అబ్బాయి ఇల్లు తుడిస్తే ఏంట్రా అమ్మాయి చేసే పని చెస్తున్నవ్ అంటూ చెప్పే మాట నుంచే వివక్ష ధోరణి కనిపిస్తోందని, ఇక్కడి నుంచే మార్పు రావాలని, ఈ పని వీరే చెయ్యాలని ఎక్కడ చెప్పలేదని తెలిపారు. మన ఆలోచన విధానంలో మార్పు రావాలని స్పష్టం చేశారు.

నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఐఏఎస్ మాట్లాడుతూ..

నా విజయంలో ముగ్గురు స్త్రీలు ఉండడం జరిగిందన్నారు. నగర పాలక సంస్థ ద్వారా 700 ప్రొడక్ట్స్ ఆన్లైన్ మార్కెటింగ్ చెయ్యడం జరిగిందన్నారు. తద్వారా  ఆన్లైన్ మార్కెటింగ్ చెయ్యడం కోసం ఈ కామర్స్ విధానం సమర్ధవంతంగా చేపట్టడం జరిగిందన్నారు. మా కార్పొరేషన్ వెన్నుముకగా శానిటరీ వర్కర్లు, సచివాలయం సిబ్బంది ఉన్నారు, వారిలో పెద్ద ఎత్తున మహిళలు ఉండడం గమనార్హం అని వారి సేవలు సదా అభినందనీయం అన్నారు.

డిఎస్పీ భవ్య కిశోర్ మాట్లాడుతూ

సైబర్ క్రైమ్ ల బారిన పడకుండా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. మహిళ రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలను చెప్పట్టి మీ భద్రతా మా బాధ్యత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాల పిపిటి ను ప్రదర్శించారు.

మహిళల సాధికారత, ఆర్ధిక చేకూర్పూ కోసం జిల్లాలో అమలు చేస్తున్న ప్రగతి నివేదిక ను డీ ఆర్ డి ఎ పిడి ఎన్ వి వి ఎస్ మూర్తి వివరించారు.

అత్యంత వేడుకగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించేందుకు తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యెక ఆకర్షణ గా నిలిచాయి. తొలుత సభ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్య అతిథులు మెప్మా, డి ఆర్ డి ఎ, నగరపాలక సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ, డి ఎల్ ఎస్ ఎ, పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ ప్రదర్శన తిలకించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, నగరపాలక సంస్థ శానిటరీ సిబ్బందికి సన్మానం, డి ఆర్ డి ఎ , మెడికల్ , ఆర్ట్స్ కళాశాల, స్పోర్ట్స్ , వ్యవసాయ , చిన్నారులను 77 మందికి అవార్డులు అందుకున్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం, సర్టిఫికెట్ అందచేశారు. మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహిళ జిల్లా అధికారులని సన్మానించడం జరిగింది.

ఈ వేడుకల్లో అదనపు ఎస్పీ లు సుబ్బరాజు, మురళీ కృష్ణ,డిఎస్పీలు భవ్య, విద్య,పిడి మహిళ శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి, డీ ఆర్ డి ఎ పిడి ఎన్ వి వి ఎస్ మూర్తి, పోలిసు అధికారులు, జిల్లా అధికారులు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

International Women's Day