Trinethram News : హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు. ఆటోడ్రైవర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకూ ప్రయాణించారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్లకార్డులను ప్రదర్శించారు. 6.5 లక్షల మంది రోడ్డున పడ్డారని, వారికి నెలకు రూ.10 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలని కోరారు.
మరోవైపు సభలోకి ప్లకార్డులను తీసుకెళ్లేందుకు భారాస నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నల్ల కండువాలు వేసుకుని శాసన మండలికి వచ్చిన భారాస ఎమ్మెల్సీలను తొలుత భద్రతా సిబ్బంది అనుమతించలేదు. కాసేపు వాగ్వాదం తర్వాత లోపలికి పంపించారు.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు
Related Posts
TGPSC : 25న వెరిఫికేషన్
TRINETHRAM NEWS 25న వెరిఫికేషన్..!! Trinethram News : హైదరాబాద్, నవంబర్ 23 : భూగర్బ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా 25న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి నాంపల్లి…
నాలుగో రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న వికలాంగులు
TRINETHRAM NEWS నాలుగో రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న వికలాంగులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన విధంగా వికలాంగులకు 6000 వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ గీత కార్మికులకు…