TRINETHRAM NEWS

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జీడికే-1&3, CSP-1 లలో ఉదయం ఏడు గంటలకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులతో మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యజమాన్యం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు, యాజమాన్యం సింగరేణి స్కూల్స్ ను ఆధునికరిస్తామని సీబీస్ సిలబస్ ప్రవేశపెడతామని చెప్పి ఇప్పటివరకు ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తున్నారని, యువ కార్మికులు వారి పిల్లల చదువుల కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, 2025 సంవత్సరంలో కచ్చితంగా స్కూల్ లన్ని ఆధునికరించి సీబీఎస్ఈ సిలబస్ తో ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు,

సింగరేణి హాస్పిటల్ ను ఆధునికరిస్తామని చెప్పి యజమాన్యం ప్రకటనలకే పరిమితమవుతూ కాలయాపన చేస్తున్నారని, కార్మికులు వారి ఇంటికి కుటుంబ సభ్యులు రిఫెరల్ పై కార్పొరేట్ హాస్పిటల్కు వెళితే అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనేక సందర్భాలలో ఫోన్లు చేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాకు తెలుసు అని తీరా ట్రీట్మెంట్ జరిగి ఇంటికి వచ్చి డ్యూటీ చేస్తున్న సమయంలో జీతాలలో కోత విధిస్తున్న పరిస్థితి ఉందని అన్నారు, ఇలాంటి పరిస్థితులలో కంపెనీ ఉత్పత్తిలో లాభాలలో భాగస్వామ్యం ఉన్న కార్మిక కుటుంబ సభ్యుల విద్యా వైద్యం పట్ల యజమాన్యం నిర్లక్ష్య వైఖరి పూర్తిస్థాయిలో కనబడుతుందని, కార్మికులు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడేది లేదని చెప్తున్నా యజమాన్యం పై విషయాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్షులు ఆరెపల్లి రాజమౌళి, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరి రావు, ఉపాధ్యక్షులు సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, దాసరి సురేష్, తుమ్మల కృష్ణారెడ్డి, రమేష్, జలగం సత్యనారాయణ, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Improve education and medical