
సంత స్థలాన్ని కాపాడాలి
ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్.
అల్లూరి జిల్లా అరకు నియోజవర్గం త్రినేత్రం న్యూస్ అరకువేలి మండలం ఏప్రిల్ 3: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం సుంకర మెట్ట పంచాయతీ సుంకర మెట్ట సంత నిర్వహించే ఖాళీ స్థలంలో గిరిజన నేతరుడు సుంకర మెట్ట గ్రామంలో నివసిస్తున్న చెబోళ్లు రమేష్ బినామీ కొర్ర గాసి పేరుతో నిర్మిస్తున్న అక్రమ కట్టడన్ని కూల్చాలని ఆదివాసీ గిరిజన సంఘం అధ్వర్యంలో అరకు వేలి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
గిరిజన సంఘం మండల కార్యదర్శి గత్తుం బుజ్జి బాబు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు బినామీ పేర్లతో విచ్చలవిడిగా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయి.సుంకర మెట్ట సంత జరిగే స్థలంలో కొంతమంది స్థానిక బినామీ వ్యక్తులతో కలిసి ప్రజా ఉపయోగ పడే స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేయడం వలన భవిష్యత్ లో సుంకర మెట్ట సంత నిర్వహణ కె స్థలం లేని దుస్థితి ఏర్పడుతుంది. దీనిని రెవిన్యూ అధికారులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమం గిరిజన సంఘం మండల నాయకులు కె. రామారావు పి. నాని బాబు పి. రామన్న పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
