TRINETHRAM NEWS

తేదీ : 21/03/2025. చిత్తూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కేంద్రమైన చిత్తూరు నడిబొడ్డున అక్రమ లాటరీ దందా నడుస్తుంది. ఇటు జిల్లా కలెక్టర్, అటు జిల్లా ఎస్పీలు ఉన్న గాని ఖాతరు చేయని లాటరీ ముఠా. నగరంలోనే సుమారు ప్రతిరోజు రూపాయలు30 లక్షల లాటరీ అక్రమ వ్యాపారం జరుగుతుంది. ప్రింటింగ్ మిషన్ పెట్టుకొని ప్రజలకు కుచ్చుటోపి పెట్టి బాలాజీ అనే వ్యక్తి దోచుకుంటున్నాడని ప్రజలుఆరోపించడం జరిగింది.
నాలుగు గంటల్లో చోరీకు పాల్పడినటువంటి దొంగలను పట్టుకుని రికార్డులు బద్దలు కొట్టిన పోలీసులకు ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరకాలం పూర్తి అవుతున్న గాని లాటరీ ముఠాను అరికట్టలేక పోతున్నారు అన్న ఆరోపణలు ప్రజల్లో గట్టిగా అనిపిస్తుంది. దందాలు ప్రతిపక్షానివి, చివాట్లు అధికార పక్షానికి . దినసరి కూలీలు లాటరీ మహమ్మారికి బానిసలై వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడుతున్నారు.
అదేవిధంగా పోలీస్ స్టేషన్ కు కొంత దూరంలోనే లాటరీ దుకాణాలు నడుస్తున్నాయి. మరి చిత్తూరు నగరంలో చెలరేగి పోతున్న “”పుష్ప”” ఎవరు? దమ్ముంటే పట్టుకోండి షికావత్ అంటున్న లాటరీ ముఠా . ఇది ప్రభుత్వం వైఫల్యం మా? లేక అధికారుల వైఫల్యం మా? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, రాష్ట్ర డిజిపి కి రాప్తా పూర్వకంగా ఫిర్యాదు ?

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Illegal lottery racket