Identification of beneficiaries with house to house survey
బీసీజి టికా పై జిల్లా స్థాయి శిక్షణ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్
ఇంటింటి సర్వే తో లబ్ధిదారుల గుర్తింపు
రామగుండం, మే -27: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలో ఉన్న పెద్దలందరికీ బీసీజి టీకా అందించేందుకు సిబ్బందికి జిల్లా శిక్షణ అందించామని జిల్లా వైద్య ఆరోగ్య
శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ అన్నారు
సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టిపిసి లోనే మిలీనియం హాల్ లో పెద్దలకు టీబీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు , పర్యవేక్షణ అధికారులకు, ఆశ నోడల్ పర్సన్, టీబీ నోడల్ పర్సన్స్ లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాల్లోని పెద్దలకు ఉచితంగా బీసీజీ వ్యాక్సినేషన్ అందించేందుకు వీలుగా అవసరమైన కార్యాచరణ చురుకుగా సాగుతోందనీ, ఈ శిక్షణ తరువాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు
అదేవిధంగా ఈ బి.సి.జి. వాక్సిన్ సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాగా చిన్న పిల్లలకు ఇచ్చేదని, పెద్దవారికి అడల్ట్ డోస్ ఇస్తారని, ఈ వ్యాక్సిన్ పైన అపోహలు పడొద్దని అన్నారు
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, వెల్నెస్, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వాక్సిన్ ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎవరెవరికి ఇవ్వాలనేది ఇంటింటి సర్వే ఆధారంగా గుర్తిస్తున్నామని అన్నారు
అనంతరం డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్స్ డా .విష్ణు, డా.అతుల్ నజీమ్, స్టేట్ టి.బి. కోఆర్డినేటర్ డా.ఆదిత్య,
ఎం.ఎస్.ఎచ్ శ్రీ రాజేశ్వర్ లు, వైద్యులకు,వైద్య సిబ్బంది ఇంటి ఇంటికి వెళ్లి సర్వే ద్వారా బీసీజీ వాక్సిన్ అర్హులను గుర్తించి, క్షయ వ్యాధి నివారణ లో ఈ వాక్సిన్ విజయవంతం పై అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.పి.కృపా బాయి, డా.కె.వి.సుధాకర్ రెడ్డి, ప్రోగ్రామ్ అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App