MP Kesineni : పూర్తి సహకారం అందిస్తాను

TRINETHRAM NEWS

తేదీ : 29/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ను యోగాంధ్ర ప్రదేశ్ గా చేసేందుకు సహకరించిన యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆప్ రాష్ట్ర సభ్యులను, జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేని . శివనాథ్ (చిన్ని) అభినందించడం జరిగింది. గురునానక్ కాలనీలో ఎన్టీఆర్ భవన్ పార్టీ కార్యాలయంలో వాళ్లు ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు.
అదేవిధంగా ఈనెల ఇరవై ఒకటి వ తేదిన జరిగినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న యోగాసన అథ్లెట్స్ పి. వెంకట త్రివేణి, సి. భార్గవి, ఎం. అక్షయ్, బి. అనూష, ఎ. పూజలత ల ను న్యూఢిల్లీలో ఏప్రిల్ ఇరవై ఐదు వ తేది నుంచి ఇరవై ఏడు వ తేది వరకు జరిగిన రెండు వ ఎసిషియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకాన్ని సాధించినటువంటి బి. కె. రాములు, బి. శిరీష, కావ్య శ్రీ, డి . ధీరజ్ కృష్ణలను ఎంపీ ప్రత్యేకంగా అభినందించి, శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా యోగా అథ్లెట్స్ మనోహర్ , గణేష్ ప్రదర్శించిన ఆర్టిస్టిక్ యోగా ప్రదర్శన శివనాథ్ ఆసక్తిగా తిలకించాడు. ఈ సందర్భంగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు అక్టోబర్ నెల విజయవాడలో నేషనల్ యోగా కాంపిటీషన్స్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని , మంచి ప్రతిభ కనబరిచిన చిన్నారులకు, విద్యతోపాటు యోగాలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కలిసి యోగా చేయడం చిన్నారులకు లభించటం గొప్ప అవకాశం. ఆస్ఫూర్తితో భవిష్యత్తులో రాణించే విధంగా కెరియర్ ను తీర్చిదిద్దుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఎ. రాధిక, గౌరవ అధ్యక్షులు కొట్టిపాటి. రామకృష్ణ ప్రసాద్, కార్యదర్శి పర్వతనేని. ప్రేమ కుమార్, ఉపాధ్యక్షులు ఎం. రాజశేఖర్ రెడ్డి, సభ్యులు ఎస్. రాజేశ్వరి, దుర్గారావు, ఎస్. నాయుడు, సిహెచ్. దాసయ్య లతో తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

I will provide full

You cannot copy content of this page

Scroll to Top