TRINETHRAM NEWS

నందమూరి బాలకృష్ణ ఇంటికి హైడ్రా మార్కింగ్?

Trinethram News : హైదరాబాద్ నగరంలో గతకొన్ని రోజులుగా బుల్డోజర్లు హడలెత్తిస్తున్నా యి. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు బుల్డోజర్లుతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. దీంతో బుల్డోజర్ పేరు విన్నా.. దాని అలకిడి విన్నా నగర ప్రజలు వణికిపోతు న్నారు.

ఈ క్రమంలో తాజాగా.. హీరో నందమూరి బాల కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇళ్లకు త్వర లోనే బుల్డోజర్లు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఇది అక్రమ నిర్మా ణాలకు సంబ ధించినది కాదు. నగరంలో రోడ్డు విస్తరణ చేపట్టగా..

అందులో బాలకృష్ణ, జానారెడ్డి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ప్రముఖు లు తమ నివాస స్థలాలను కోల్పోనున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయా ఇండ్లకు మార్కింగ్ చేసారు.

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ప్రణాళికలు రెడీ చేసుకుంది.

బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్, మహారాజ అగ్రసేన్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.45, చెక్‌పోస్టు, కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు కూడళ్లలో రూ.1,200 కోట్లతో ఏడు ఐరన్ బ్రిడ్జిలు, ఆరు అండర్‌ పాస్‌లను నిర్మించనుండ గా.. ఆ పనుల్లో వేగం పెం చారు. అయితే బాలకృష్ణ ఇల్లు రోడ్డు నం.45, 92 కూడలి వద్ద ఉండటంతో రెండు వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉందని అధి కారులు చెబుతున్నారు.

దీంతో ఆయన దాదాపు సగం భూమి నష్టపోతారని అంచనా. ఇక ఒమేగా హాస్పిటల్ సమీపంలో జానారెడ్డికి రెండు ప్లాట్లున్నాయి. వాటిని 43 అడుగుల మేర రోడ్డు కోసం సేకరించాల్సి వస్తోంది. ఈ విస్తరణలో ఆయన దాదా పు 700 గజాలు ఆయన నష్టపోవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ఇండ్లకు మార్కింగ్ చేశారు.

రోడ్డు విస్తరణ, ప్లైఓవర్లు నిర్మించేందుకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అందుకే రోడ్డు విస్తరణకు అవసరమైన చోట భూసేకరణకు మార్కింగ్ చేస్తున్నారు. ఎంత మేర భూమి అవసరం అవుతుం దో అంత మేరకు నోటీసులు జారీ చేస్తున్నారు.

నిర్మాణదారుల అనుమతి తోనే .. చట్ట ప్రకారం పరిహారం ఇచ్చి భూమిని సేకరించనున్నారు. ఇల్లు మొత్తం తీసేయడం ఉండ దని.. రోడ్డుకు అవసరమై నంత తీసుకుంటారని అధికారులు చెబుతు న్నారు.

కాగా, ఇళ్లకు మార్కింగ్ చేయటంపై మాజీ మంత్రి జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగు తోంది. అయినా రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గరని.. త్వరలోనే బుల్డోజర్లు దూసుకెళ్తాయని నెటిజన్లు అంటున్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App