
Trinethram News : హైదరాబాద్: ఏప్రిల్ 01 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం రాజకీయంగా వేడెక్కింది. నిన్నటిదాకా విద్యార్థులు తమ నిరసన తెలిపారు. వారికి మద్ద తుగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మంగళవారం యూనివర్సిటీకి వెళ్తామని ప్రకటించారు.
ఐతే.. ఉద్రిక్తతల దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యలు తీసు కుంటున్నారు. హైదరాబాద్ లో బీజేఎల్పీ నేత మహేశ్వ ర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి ముందు భారీగా పోలీసు లను మోహరించారు.
ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిన హెచ్ సీయూ భూముల పరిశీలనకు నేతలు వెళ్లాలనుకున్నప్ప టికీ పోలీసులు ఆటంకాలు సృష్టించారు. భూములను ముఖ్యనేతలతో కలిసి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు..
ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ బృం దం హెచ్సీయూను సంద ర్శించాలని నిర్ణయించారు.
పోలీసులు లాఠీచార్జీలో గాయపడిన యూనివర్సిటీ ఏబీవీపీ విద్యార్ధులను పరామర్శించాలనుకున్నారు. ప్రభుత్వం చదును చేస్తున్న 400 ఎకరాలను కూడా పరిశీలించాలనుకు న్నారు. ఐతే పోలీసుల హౌజ్ అరెస్ట్ చర్యలను లీడర్లు తప్పుపడుతు న్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
