సెప్టెంబర్ 15, 2026
TRINETHRAM NEWS
Horrific Road Accident

ఇద్దరు మృతి ఒకరికి గాయాలు.

Horrific Road Accident : డిండి (గుండ్లపల్లి) ఆగష్టు 24, త్రినేత్రం న్యూస్. డిండి మండలకేంద్రం సమీపంలోని జాతీయ రహదారి 765 పై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం TS 07 J9613 నంబర్ గల యూనికాన్ వాహనంపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. డిండి సమీపంలోని Hp పెట్రోల్ బంక్ వద్ద రెండు కార్లు నెమ్మదించడంతో ద్విచక్ర వాహనాన్ని తడుపుతున్న వ్యక్తి వాటిని దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఎదురుగా అధిక వేగంతో వస్తున్న T S 10 FE 1161 నంబరు గల MG ఆస్టర్ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కీచక వాహనంపై ప్రయాణిస్తున్న చంద్రకళ, ఇస్లావత్ నాగ రాజు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాంత్ గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న డిండి పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. MG ఆస్టర్ కారు డ్రైవర్ ను గుర్తించి ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతులు లింగాల మండలం రాయవరంకు చెందినవారుగా ఎస్సై బాలకృష్ణ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page