Trinethram News : Mar 18, 2024,
ఉత్తరాదిపై గత కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో.. అక్కడక్కడా భారీ హిమపాతాలు ఏర్పడ్డాయి. దీంతో బండిపోరా–గురేజ్ రహదారి మంచు కారణంగా మూసుకుపోయింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగి రోడ్డుపై పడిన మంచును క్లియర్ చేసే పనులు చేపట్టింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతుంది.