TRINETHRAM NEWS

Trinethram News : గోదావరి జిల్లా: ఫిబ్రవరి01
ఎటువంటి బిల్లులు లేకుండా 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్న 10 మంది ముఠా సభ్యులను పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ బంగారం విలువ రూ.3.85 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. భీమవరంలో గురువారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

కారు అనుమానాస్పదంగా ఉండటంతో సోదాలు చేశారు. ఈ సోదాల్లో 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు.

బిల్లులు చూపకపోవడంతో 10 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ బంగారం ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరికి ఇస్తున్నారనే విషయాలు మాత్రం బయటకు రాలేదు.

నిందితులు ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..