పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా లోని కేంద్రంను జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి, డాక్టర్ వి. వాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో టి-హబ్ డయాగ్నొస్టిక్స్ కేంద్రం ప్రారంభం అయిన నాటి నుండి నేటి వరకు నిరంతరాయంగా కొనసాగుతున్నది అని అన్నారు. గత పక్షం రోజులు గా పెద్దపల్లి లో టి- హబ్ పనిచేయడం లేదు అని ఒక దినపత్రిక లో తప్పుడు సమాచారం వలన పొరపాటుగా ప్రచురితం అయ్యింది అని అన్నారు. అందుకే ఈ రోజు టి-హబ్ ను సందర్శించడం జరిగింది అని అన్నారు. టి-హబ్ పనిచేస్తుంది కావున ఈ సౌకర్యాన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవసరమైన ప్రజలు వినియోగించాలి అని అన్నారు.
పెద్దపల్లి జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మంథని, సుల్తానాబాద్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ జనరల్ అసుపత్రి, రామగుండం మరియు జిల్లా ఆసుపత్రి, పెద్దపల్లి నుండి రక్త పరీక్షలు సేకరించి టి-హబ్ కు నిర్దారణ పరీక్షలకు పంపిస్తారు. టి-హబ్ యందు 56 రకాల నిర్దారణ పరీక్షలు చేయడం జరుగుతుంది అని అన్నారు. టి-హబ్ జిల్లా కేంద్రం లో ఉండడమే కాకుండా శాంపిల్స్ లు పంపే ప్రతి ఆరోగ్య ఫెసిలిటీ కి సమీప దూరం (30 కి. మి లోపు) లో ఉండడం వల్ల రక్త పరీక్షల శాంపిల్స్ టి- హబ్ కు చేరిన వెంటనే టెస్ట్ నిర్వహించి, పరీక్షల ఫలితాల నివేదికను అదే రోజు సాయంత్రం వరకు రోగి చరవాణికి అందించడం జరుగుతుంది అని అన్నారు. ఈ నెలలో 7444 రోగుల నుండి 24414 రక్త పరీక్షలు చేయడం జరిగింది అని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


