తెలంగాణ తల్లి రూపం మారిస్తే కఠిన చర్యలు
Trinethram News : తెలంగాణ : తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ప్రతి ఇంట్లోని కన్నతల్లిని చూసిన భావన కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ అమ్మను చూసిన భావన కలిగేలా విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, అస్తిత్వం ఉట్టిపడేలా బహుజనుల తెలంగాణ తల్లిగా రూపొందించామన్నారు.
తెలంగాణ తల్లి.. ఉద్యమ కాలం నుంచీ ఓ ఉద్వేగం.. ఆ ఉద్వేగానికి ఇప్పుడు అధికారిక రూపం వచ్చింది.. ప్రశాంత వదనంతో.. ఆకుపచ్చ చీరలో గ్రామీణ మహిళను పోలి ఉండే రూపంతో ఉన్న విగ్రహాన్ని సచివాలయం ఆవరణలో రేవంత్ సర్కారు ఏర్పాటు చేసింది.. హుస్సేన్ సాగర్ తీరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లిని బహుజనుల తల్లిగా అభివర్ణించారు. ప్రతి ఇంట్లోని తల్లికి ప్రతి రూపమే విగ్రహ రూపమని, దానిని మార్చినా.. ఏ రూపంలో అవమానించినా చట్టపరంగా తీవ్ర చర్చలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ తల్లిపై తొలుత అసెంబ్లీలోనూ ఆ తర్వాత సచివాలయ ప్రాంగణంలో జరిగిన సభలోనూ ఆయన మాట్లాడారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ప్రతి ఇంట్లోని కన్నతల్లిని చూసిన భావన కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ అమ్మను చూసిన భావన కలిగేలా విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, అస్తిత్వం ఉట్టిపడేలా బహుజనుల తెలంగాణ తల్లిగా రూపొందించామన్నారు. విగ్రహ రూపకల్పన సందర్భంలో రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని, దేవతలా ఉండాలా? సొంత మాతృమూర్తిలా ఉండాలా? అన్న చర్చ జరిగిందని పేర్కొన్నారు. దేవత గుడిలో ఉంటుందని, తల్లి ఇంట్లో ఉంటుందని, మనల్ని ఒడిలో పెట్టుకుని పెంచుతుందని గుర్తు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App