
శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ వడ్డెర సంఘం
Gunja Renuka : దేవరకొండ డివిజన్ మే 07, త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర వడ్డెర సహకార కార్పొరేషన్ లిమిటెడ్ నూతన ఛైర్మన్ గా నియమితులైన గుంజ రేణుక వెంకట నారాయణ కి దేవరకొండ నియోజకవర్గ వడ్డెర సంఘం తరపున ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షులు ఇరగదిండ్ల కృష్ణ మాట్లాడుతూ.. వడ్డెర సామాజిక వర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే రేణుక ని ప్రభుత్వం ఈ పదవికి ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆమె నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వడ్డెరల సంక్షేమానికి మరిన్ని పథకాలు అందుతాయని, కార్పొరేషన్ ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
వడ్డెరల సమస్యల పరిష్కారానికి, వారి ఆర్థిక ఎదుగుదలకు ఈ నియామకం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంటూ, తమ సామాజిక వర్గం తరపున ఆమెకు పూర్తి మద్దతు ఉంటుందని కృష్ణ తెలిపారు.నూతన ఛైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో నియోజకవర్గ కార్యదర్శి ఇరగదీండ్ల వెంకటేష్, వేముల గోవిందు, బాలరాజు, వరికుప్పల రాములు, ఇరగదీండ్ల హరీష్, ఓర్సు రవి, ఉపసర్పంచ్ పి.ఎఫ్. పెళ్లి, ఇరగదీండ్ల రాములు, విజయ్ కుమార్, వరికుప్పల వెంకటయ్య, గండికోట వెంకటయ్య, వెంకట రాములు తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

