ఎన్ ఎఫ్ ఐ డబ్లు,సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
భారత జాతీయ మహిళా సమాఖ్య,భారత కమ్యూనిస్టు పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నేడు జగతగిరిగుట్ట సీపీఐ కార్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మహిళ సమాఖ్య కార్యదర్శి హైమావతి నాయకత్వం వహించగా సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ లు ముఖ్యాతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలను నిర్వహించడం అభినందనీయమని,ఈ రకంగా మహిళలను ఐక్యం చేసి వారి కనీస హక్కులను కాపాడటం కోసం,పార్లమెంట్ లో 33 శాతం రిజర్వేషన్లు కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తుందని,నేటి పరిస్థితిలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని కావున మహిళలు మరింతగా రాణించాలని దానికి మహిళా సమాఖ్య పోరాటాలను నిర్వహించాలని కోరారు.ఫ్యాషన్ సమాజంలో నూతన పోకడలు పెరిగుతున్న సందర్భంలో మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం మంచిదని కావున ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.విజేతలుగా నిలిచిన రేణుక,వినోద,అభిజ్ఞ లకు బహుమతులను ప్రదానం చేసి అందరికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి,హరినాథ్, సహాయ కార్యదర్శి దుర్గయ్యలు పాల్గొన్న వారికి జ్ఞాపికలను అందించారు.
ఈ కార్యక్రమంలో మహిళ సమాఖ్య నాయకురాలు లక్ష్మీ, మహేశ్వరి,శిరీష, సరిత, ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్,మునిసిపల్ అధ్యక్షుడు రాములు,సీనియర్ నాయకులు వెంకటేష్,శాఖ కార్యదర్శి సహదేవ్ రెడ్డి,విద్యార్థులకు నరేందర్ బహుమతులు ఇవ్వగా యువజన నాయకుడు సంతోష్,సీపీఐ నాయకులు రాజు, ఇమామ్,ప్రభాకర్, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు