TRINETHRAM NEWS

నగరి ఓం శక్తి ఆలయంలో ఘనంగా ఇరుముడి ఉత్సవాలు

నగరి త్రినేత్రం న్యూస్

చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణంలో వెలసి ఉన్న ఆదిపరాశక్తి ఆలయం నందు ప్రత్యేక అభిషేకాలు పూజలు గత వారం రోజులుగా జరుగుచున్నాయి పట్టణ ప్రాంత భక్తులు పరిసర ప్రాంత భక్తులు అమ్మ వారి శక్తి మాల ధరించి ఇరుముడి ఉత్సవములో పాల్గొనుచున్నారు
అందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం సహపంక్తి భోజన కార్యక్రమం సుమారు 700 మందికి వివిధ రకములైన వంటకాలను భక్తులకు వడ్డించడం జరిగింది

తదుపరి 36 మంది వయోవృద్ధులకు చీరలు .పంచలు, వస్తాదానం చేయబడినది శక్తి మాల ఎరుపు దుస్తులు ధరించిన మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సేవించుకున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App