సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Government Cracks Obscene Social Media

Government Cracks Obscene Social Media : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 11 ; సోషల్ మీడియాలో అసభ్యకర , అభ్యంతరకర పోస్టులు చేస్తున్న వాళ్లపై రాష్ట్ర పోలీసులు కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే 20 కేసులు నమోదు అయినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

అయితే ఈ కేసుల్లో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా పైన తెలిపిన విధంగా పోస్టులను ప్రచారం చేసినట్లయితే చట్ట పరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించినట్లు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే వాళ్లపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page