
Electricity Officials Act : ముంచంగిపుట్టు, ఆగస్టు 12, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండలం, సుజనకోట గ్రామంలో విద్యుత్ సమస్యలపై అధికారులు స్పందించారు. పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్ ద్వారా సమస్యలు అధికారుల దృష్టికి వెళ్లడంతో విద్యుత్ శాఖ డీఈ, ఏఈలు మంగళవారం గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలంలో నీట మునిగే విద్యుత్ డీబీని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలోని ప్రతి ఇంటి విద్యుత్ మీటర్లకు సీల్ వేసే ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి హామీ ఇచ్చిన అధికారులకు సామాజిక కార్యకర్త వెంగడ జగన్ గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe