జూలై 13, 2026
TRINETHRAM NEWS
Good news

Good News : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్:జులై 02 : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల కు భారీ ఉపశమనం కలిగింది.జూలై 01 వ తేదీనే వారి అకౌంట్ల లోజీతాలు జమ చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

గతంలో జీతాలు ఆలస్యంగా రావడం తో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుం ది.కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నిర్ణీత తేదీన జీతాలు పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్ష లో అధికారులను ఆదేశించారు.

ఆ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖలకు స్పష్టమైన మార్గద ర్శకాలను జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. ప్రతి నెల 25వ తేదీలోగా సంబంధిత శాఖలు జీతాల బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగా లకు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే నెల చివరి పని దినానికల్లా బిల్లుల పరిశీలన.. ఆడిట్ ప్రక్రియ పూర్తి చేసి.. తదుపరి నెల మొదటి తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమయ్యే లా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర ప్రభు త్వం సూచించింది.

ఈ నెల బిల్లులు సకాలంలో అందిన అన్ని శాఖల ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివే దిక సమర్పించారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసు కున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం ప్రతి నెల ఎదురుచూడాల్సిన పరిస్థితి ఇక నుంచి ఉండదని.. కుటుంబ ఆర్థిక ప్రణాళికలు కూడా సులభతరం అవుతాయని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page