
పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు
Trinethram News : నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.అసలేం జరిగిందంటే..మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తన బంధువుతో కలిసి ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి శనివారం సాయంత్రం వచ్చింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రాత్రి ఆలయం ప్రాంగణంలోనే నిద్ర చేయాలనుకున్నారు. ఈ క్రమంలో యువతి కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి వెళ్ళింది. ఆమె వెంట బంధువు కూడా వెళ్లారు.
అక్కడే ఉన్న 8 మంది యువకులు యువతి వెంట వచ్చిన బంధువుపై దాడి చేశారు. అనంతరం అతడి కాళ్లు, చేతులు కట్టేశారు. అనంతరం యువతిని గుట్ట ప్రాంతంలో నిర్మానుష్య చోటుకు తీసుకువెళ్లి యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఉరుకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. నిందితులను ఊర్కొండ పేటకు చెందిన 8 మందిగా గుర్తించారు. యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరి జాడ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
