జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 04 at 13.18.38

TRINETHRAM NEWS

Free Volpo Dump Truck Operator Training in RG1

సద్వినియోగం చేసుకోండి ఆర్జీ. 1 జి.యం చింతల శ్రీనివాస్

గోదావరి ఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పదవ తరగతి పాసై, హేవీ గూడ్స్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, మూడేళ్ల అనుభవం ఉన్న పరిసర గ్రామాల నిరుద్యోగ యువకులకు ఉచితంగా వోల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ ఇవ్వబడునని ఆర్జీ. 1 జి.యం. చింతల శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సింగరేణి రామగుండం-ఏరియా.1 ఏరియాలోని ప్రభావిత ప్రాంతాల, పరిసర గ్రామా lల నిరుద్యోగ యువకులు ఇట్టి అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులనుండి దరఖాస్తులు స్వీకరించి, వారికి వైద్య పరీక్షలు చేసి, శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

ఈ శిక్షణకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని, ఎస్సీ, ఎస్.టి. అభ్యర్థుల కు వయోపరిమతి సడలింపులో ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయని వారు అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తేదీ 10.07.2024 లోపు స్థానిక జి .వి.టి. సి. కార్యాల యంలో స్వయంగా హాజరై దరఖాస్తులు అందజేయాలని అన్నారు. కావున నిరుద్యోగ యువకులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free Volpo Dump Truck Operator Training in RG1

You cannot copy content of this page