TRINETHRAM NEWS

తేదీ : 07/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, వేమిరెడ్డిపల్లి గ్రామం సొసైటీ బ్యాంకు నందు మానస కృష్ణ భారత్ గ్యాస్ , రామ్ సాయి పెయింట్స్, నిర్మల సాయి టైల్స్ వారి ఆధ్వర్యంలో వైద్యులు పిన్నమనేని . మెడికల్ కాలేజ్ వైద్యశాల డాక్టర్లచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది.

శిబిరానికి వచ్చినటువంటి పేషెంట్లకు బీపీ, షుగర్ టెస్టు లు చేసి ఎవరైతే ఎటువంటి అనారోగ్యం కలిగి ఉన్నారో దానికి సంబంధించిన వైద్యులచే చికిత్స మరియు, మందులు ఇచ్చారు. మంచినీరు మరియు, బిస్కెట్ ప్యాకెట్స్ , టి మరియు, రిబ్బన్ కట్ చేసి వైద్య విభాగాన్ని ప్రారంభించడం జరిగింది. సుబ్బారావు, అప్పారావు, కుటుంబరావు, ఎంపిటిసి గ్రామ నాయకులు కలిసి అందరూ కలిసి ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు.

వచ్చినటువంటి వైద్యులకు, ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించారు. డాక్టర్ సుధా మరియు నాగేశ్వరరావు సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంజుష .( పి జి. యం డి యస్,).యం. భావన (బిడియస్.). దివ్య (బిడియస్). తదితర వైద్యులు పాల్గొనడం జరిగింది. అక్కడికి వచ్చిన పేషెంట్లు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free Mega Healing