
సీనియర్ సిటిజెన్ లకు ఉచిత లైఫ్ సర్టిఫికెట్ లు మరియు బ్యాంకులో ఆన్లైన్ ద్వారా జరిగే మోసాలకు అవగాహన సదస్సు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని లో గాంధీనగర్ లోని సీనియర్ సిటిజన్స్ సోషల్ సర్వీస్ కార్యాలయంలో వయోవృద్ధులైన రిటైర్డ్ ఉద్యోగులకు ఐసిఐసిఐ బ్యాంక్ అధికారులు ఉచిత లైఫ్ సర్టిఫికెట్స్ జారీ చేయడంతో పాటు పెన్షనలకు బ్యాంకులో ఆన్లైన్ ద్వారా జరిగే మోసాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు పిటి స్వామి, ప్రధాన కార్యదర్శి గంట సత్తయ్య, మరియు నాయకులు పి నాగరాజు, కే సత్యనారాయణ రెడ్డి, వి వెంకటేశ్వరరావు, బి భోజరాజు, మోహన్ రావు, కోట కనకయ్య, మొదలగు వారు పాల్గొన్నారు
ఈ సందర్భంగా పిటి స్వామి, గంట సత్తయ్య, ఐసిఐసిఐ బ్యాంక్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం నవంబర్ చివరి వరకు కొనసాగుతుందని ఎవరైనా పెన్షనర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్టిపిసి శాఖకు వెళ్లి సర్టిఫికెట్లు పొందవచ్చని వారు తెలియజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
